శాసన సభలో రైతు భరోసా పై చర్చలో కే.టి.ఆర్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు.
శాసన సభలో రైతు భరోసా పై చర్చలో కే.టి.ఆర్ పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు.
చర్చలో భాగంగా.. కే.టీ.ఆర్. 24 గంటల విద్యుత్తు గురించి ప్రస్తావించగా.. వెంకటరెడ్డి లేచి 24 గంటల కరెంటు అనే మాట అవాస్తవం అని చెప్పుకొచ్చారు. సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ లు తీసి చూద్దాం.. ఏ ఒక్క రోజు కూడా ఇవ్వలేదని సీరియస్ అయ్యారు.
ఉచిత విద్యుత్తు గురించి మాట్లాడే హక్కు కేవలం కాంగ్రెస్ కే ఉంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీ.ఆర్.ఎస్. హయాం లో నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగింది. మిషన్ భగీరథ పేరుతో 50 వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు రాలేదని చెప్పుకొచ్చారు.
నల్లగొండ లోని గ్రామాలకు వెళ్లి రైతులను అడుగుదాము పద రైతులకు రుణమాఫీ పేరు మీద అన్యాయం జరిగిందో.. లేదో.. వాళ్ళే చెప్తారు అంటూ.. ఛాలెంజ్ చేసారు. లక్ష రుణమాఫీని ఆరు ముక్కలు చేసి ఇచ్చి, రైతులపై వడ్డీ భారం మోపారని చెప్పారు. మరో వైపు కే.టీ.ఆర్. కూడా చర్చకు సిద్ధం అని చెప్పారు.