గృహలక్ష్మీ పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ దాన్ని గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్ని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేన‌న్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చెప్పిన ఆరు గ్యారింటీలు చిన్న పథకాలే అయిన ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

గృహలక్ష్మీ(Gruha Laxmi) పేరుతో రూ.3 లక్షలు ఇస్తానన్న కేసీఆర్(KCR) దాన్ని గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్ని ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమేన‌న్నారు. తెలంగాణ(Telangana) ఇచ్చిన సోనియ(Sonia Gandhi)మ్మ చెప్పిన ఆరు గ్యారింటీలు చిన్న పథకాలే అయిన ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 60 రోజులు మీరు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించండని కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఆలేరు నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఆలేరు(Aleru) లో సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామ‌న్నారు. బీర్ల ఐలయ్య(Beerla Ilaiah) కు అందరు సహకరిస్తున్నారు. ఆలేరు కు ఎమ్మెల్యే(MLA) కంటే నేనే ఎక్కువసార్లు వచ్చానన్నారు. ఎమ్మెల్యే అంటే కార్లు వేసుకొని తిరగడం కాదు.. పేదోడి కష్టం తీర్చాలన్నారు.

ప్రధాని మోదీ(PM Modi) చేసిన వ్యాఖ్యలు వాస్తవం.. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్(BRS)-బీజేపీ(BJP) ఒకటేన‌న్నారు. కేసీఆర్(KCR) బండారం మోదీ బయట పెట్టార‌న్నారు. సబ్ స్టేషన్(Sub Station) లో లాగ్ బుక్ లు పెట్టండి. 24 గంటల కరెంట్(Power) ఇచ్చినట్లు రుజువైతే మేము కరెంట్ తీగలను పట్టుకుంటామ‌న్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తిని నేను.. పార్టీలు మారితేనే పదవులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిప‌డ్డారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్(Congress) లో టికెట్లు(Tickets) క‌న్‌ఫ‌ర్మ్‌ అవుతాయి. యాదగిరి గుట్ట(Yadagiri Gutta) నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

అన్ని వర్గాలకు సమానంగా కాంగ్రెస్ మేనిఫేస్టో ఉంటుందన్నారు. కాంగ్రెస్ డబ్బులతో పోటీ పడలేదు కానీ పథకాలతో పోటీ పడుతుంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలవుతాయి. పథకాలు అమలు కాకపోతే.. నా పదవులకు రాజీనామా చేస్తానన్నారు. బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడకండి.. ప్రజలరా ఆలోచించి ఓటు వెయ్యండని పిలుపునిచ్చారు.

Updated On 4 Oct 2023 8:59 PM GMT
Yagnik

Yagnik

Next Story