రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని.. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు(Regional Ring Road) కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని.. భూసేకరణ(Land Acquisition) పేరుతో బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) అన్నారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా.. రైతుల దగ్గర ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని.. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో.. భువనగిరి(Bhuvanagiri), రాయగిరి(Rayagiri) మిగిలిన గ్రామాల రైతులు(Farmers) పోరాటం చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినా, కొందర్ని అరెస్ట్(Arrest) చేశారు. జైలుకు పంపారని ఫైర్ అయ్యారు.

భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు(Bhuvanagiri District Sessions Court) వారికి బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే.. కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారు. ఇది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నా.. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. రైతుల కోసం అంత చేస్తా.. ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్.. దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్ర‌శ్నించారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూమి ఉంచుకుని.. రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాద‌ని సూచించారు. అన్నదాతలకు సంకెళ్లు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమేన‌న్నారు. అన్నం పెట్టే రైతులకే సంకెళ్లు వేయడాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్నారు. రాయగిరి ట్రిబుల్ ఆర్(RRR) రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్(KCR) నిరంకుశ పాలనకు నిదర్శన‌మ‌న్నారు.

Updated On 13 Jun 2023 7:58 PM GMT
Yagnik

Yagnik

Next Story