కోమటిరెడ్డి(Komati Reddy) రాజగోపాల్ రెడ్డి(Raj Gopal reddy) పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీజేపీలోనే(BJP) ఉన్నానని.. ఊహాగానాలు నమ్మవద్దని అన్నారు. తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ కు చెప్తానని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP) మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారని..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Reddy Raj Gopal reddy) పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీజేపీలోనే(BJP) ఉన్నానని.. ఊహాగానాలు నమ్మవద్దని అన్నారు. తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ కు చెప్తానని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP) మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారని.. వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కవిత(Kavitha) విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని.. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని.. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్(KTR) కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. కేటీఆర్ కు కేంద్ర మంత్రులు(Center Minister) అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుందని.. మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.