మాట తప్పి నల్లగొండ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి

తెలంగాణ బడ్జెట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని.. తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందని అన్నారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, తాము కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. తమ బడ్జెట్ ను విమర్శించిన వాళ్లు మూర్ఖులేనని వ్యాఖ్యలు చేశారు. కుర్చీ వేసుకుని కూర్చుని ఎస్ఎల్ బీసీ పనులు పూర్తి చేయిస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? అని కోమటిరెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు? ముక్కు నేలకు రాసి నల్గొండలో అడుగుపెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ అని అన్నారు.

మాట తప్పి నల్లగొండ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి. అసలు నల్లగొండను నాశనం చేసిందే బీఆర్ఎస్‌ పార్టీ.. అలాంటిది ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ నల్లగొండకు వస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే నల్లగొండలో అడుగుపెట్టాలన్నారు. బీఆర్ఎస్ సభ రోజున ఇక్కడికి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. ఆ తర్వాతే ప్రసంగం చేయాలని అన్నారు. ఇక కేసీఆర్ నల్లగొండకు చేసిన అన్యాయంపై నిరసనలు చేపడతామని అన్నారు.

Updated On 11 Feb 2024 4:52 AM GMT
Yagnik

Yagnik

Next Story