Barrelakka : బర్రెలక్క అకౌంట్లు బ్లాక్ చేసిందెవరు? ఆమె అకౌంట్లో ఎంత డబ్బుంది?
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్(Kllapur) అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా పెరిగింది. అలాగని అక్కడ్నుంచి ముఖ్యమంత్రో, ముఖ్యమంత్రి అభ్యర్థో పోటీ చేయడం లేదు. కర్నె శిరీష అనే ఓ పేదింటి దళిత అమ్మాయి అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. బర్రెలక్కగా(Barrelakka) సోషల్ మీడియాలో(Social media) బాగా ఫేమస్ అయిన శిరీష ఇప్పుడు ఎన్నికల(Election) రణక్షేత్రంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని(Beeram Harshavardhan Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును(Jupalli Krishna Rao) ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్(Kllapur) అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా పెరిగింది. అలాగని అక్కడ్నుంచి ముఖ్యమంత్రో, ముఖ్యమంత్రి అభ్యర్థో పోటీ చేయడం లేదు. కర్నె శిరీష అనే ఓ పేదింటి దళిత అమ్మాయి అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. బర్రెలక్కగా(Barrelakka) సోషల్ మీడియాలో(Social media) బాగా ఫేమస్ అయిన శిరీష ఇప్పుడు ఎన్నికల(Election) రణక్షేత్రంలో దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని(Beeram Harshavardhan Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును(Jupalli Krishna Rao) ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రోజురోజుకీ ఆమెకు మద్దతు పెరుగుతోంది. నిరుద్యోగ(Unemployement) అంశమే ప్రధాన అజెండాగా బరిలో దిగిన శిరిషకు ఇప్పటికే నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు బాసటగా నిలిచారు. ఇటీవల ఆమె తమ్ముడిపై జరిగిన దాడి(Attack) తర్వాత ఆమె దూకుడు పెంచారు. తనకు అండగా నిలుస్తున్న వారిని కూడా బెదిరిస్తున్నారని, అయినా తాను దేనికి భయపడనని తెగేసి చెబుతున్నారు కర్నె శిరీష. ఆమెకు కొందరు ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తున్నారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు(Malladi Krishna Rao) ఆమెకు లక్ష రూపాయల సాయం ప్రకటించారు. చిన్న చిన్న మొత్తాలు ఇచ్చినవారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే ఆమెకు కొన్ని లక్షల రూపాయలు(Money) అందినట్టు తెలుస్తోంది. సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు వచ్చాయని స్వయంగా శిరీషనే చెప్పారు. ఆ వెంటనే ఏడు కోట్ల రూపాయలు కాదని, ఏడు లక్షలు మాత్రమే తన అకౌంట్లోకి వచ్చాయని సరి చేసుకున్నారు. ఆమెకు ఆర్ధికంగా(Financial) ఏదైనా సాయం చేద్దామని అనుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం ఆమె బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. ఎవరు బ్లాక్ చేశారో ఆమెకు కూడా తెలియదు. ఈ విషయాన్ని శిరీషే చెప్పారు. ఎంత డబ్బు వస్తున్నదో తనకు కూడా తెలియడం లేదని వాపోయారు. ఇది అధికారపార్టీ పనేనని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. దళిత ఆడబిడ్డ బర్రెలక్కకు ఏదైనా సాయం చేద్దామనుకుని ఆమె గూగుల్ నంబర్‌కు ప్రయత్నిస్తే నంబర్ బ్లాక్ అయినట్టు వస్తున్నదని సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నారు. అకౌంట్లను బ్లాక్ చేసే అవసరం తమకు ఎందుకుంటుందన్నది అధికార పార్టీ నేతల వాదన!