ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి అవరణలో మొక్క నాటిన క్లిమామ్ గోశాల నిర్వహకురాలు(Klimom Goshala Founder), ఐకె ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కో కన్వీనర్ శ్రీమతి అల్లోల దివ్యారెడ్డి(Allola Divya Reddy)..

Green India Challenge
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్(Joginapally Santosh Kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) కోడలు, క్లిమామ్ గోశాల నిర్వాహకులు(Klimom Goshala Founder), ఐకె ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కో కన్వీనర్ అల్లోల దివ్యారెడ్డి(Allola Divya Reddy) పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన దివ్యారెడ్డి.. అనంతరం మాట్లాడుతూ.. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటి.. వాటిని కాపాడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
