తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 7:30 గంటలకు కిషన్‌రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి(Telangana BJP Chief)గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State BJP Office)లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 7:30 గంటలకు కిషన్‌రెడ్డి పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి(Bhagya Lakshmi Temple)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 8:20 గంటలకు అంబర్ పేట మహాత్మా జ్యోతి బాపులే(Mahatma Jyoti Bapule) విగ్రహాల వద్ద నివాళులు అర్పించనున్నారు. 8:50గంటలకు బషీర్ బాగ్(Bhasheer Bag) కనకదుర్గ అమ్మవారి(Kanakadurga Temple)ని దర్శించుకోనున్నారు. అనంతరం 9:25 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం(Ambedkar Statue), 9:30కి గన్ పార్క్(Gun Park) అమర వీరుల స్థూపం వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. తర్వాత అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి కిషన్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది.