నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగనున్న విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.

Kishan Reddy will go to Narayanapet today
నేడు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరుగనున్న విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణ పేట జిల్లా కృష్ణ నదిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కృష్ణ గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం10 గంటలకు మాగునుర్ మండలం మీదుగా మక్తల్ టౌన్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సింగారం గేట్ మీదుగా రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. చేనేత కార్మికులతో ముఖాముఖీలో పాల్గొంటారు. మంగళవారం రాత్రి నారాయణ పేటలోనే బస చేస్తారు.
