మల్లికార్జున ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారి కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఖర్గే, కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మాట్లాడిన ఆడియో బయటికి వచ్చిన నేపథ్యంలో సంబంధిత అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు.

Killing Mallikarjuna Kharge is murdering democracy, said TPCC President Revanth Reddy
మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేక వారి కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఖర్గే, కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్(Manikanta Rathode) మాట్లాడిన ఆడియో బయటికి వచ్చిన నేపథ్యంలో సంబంధిత అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదివారం జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్(Sampath Kumar) ఫిర్యాదు చేశారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు.
మణికంఠ రాథోడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. మల్లికార్జున్ ఖర్గే కుటుంబ సభ్యులను చంపితే అధికారంలోకి వస్తామని బీజేపీ(BJP) అనుకోవడం భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు.
“హైదరాబాద్-కర్ణాటక పరిధిలోకి వచ్చే చిత్తాపూర్(Chitthapur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge) ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి ప్రియాంక్ గెలవబోతున్నారు. ప్రియాంక్ మీద పోటీ చేసేందుకు అభ్యర్ధి లేక 30 క్రిమినల్ కేసులు, నగర బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ మణికంఠ రాథోడ్ ను నిలబెట్టింది” అని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని విమర్శించారు. ప్రియాంక ఖర్గేను ఓడించడానికి జాతీయ నాయకులు అందరూ చిత్తాపూర్లో మోహరించారన్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఆయన ఓడిపోయేటటువంటి అవకాశం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఖర్గేను మణికంఠ రాథోడ్ హత్య చేస్తానని బెదిరించాడు. కుటుంబంతో సహా హత్య చేస్తానని బెదిరించిన ఆడియో బయటకు వచ్చింది. దేశ భక్తులమనే బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని మోదీ, నడ్డాలను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లికార్జన ఖర్గే గారు 50 ఏళ్ల నుంచి ప్రజా సేవలో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర రైల్వే, కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గుల్బార్గా జిల్లాను ఆదర్శంగా తీర్చిద్దారు అని రేవంత్ పేర్కిన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓటు వేసి ఎన్నుకున్నారు. “2014-19 మధ్య ఖర్గే లోకసభలో ప్రతిపక్ష నేతగా మోదీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి ఉక్కిరి బిక్కిరి చేశారు. అందుకే కక్ష గట్టి అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ను ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించి, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను దుర్వినియోగం చేసి ఖర్గేను ఓడించారు” అని రేవంత్ అన్నారు.
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ(Congress) అధ్యక్షత బాధ్యతలు చేపట్టాక మొదటి అడుగులోనే హిమాచల్ ప్రదేశ్లో(Himachal Pradesh) గెలిచాం. రెండో అడుగులో కర్ణాటకలో గెలవబోతున్నాం. ఈ నెల 10న కర్ణాటక ప్రజలు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. 150 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టాబెట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయానికొచ్చారు. మూడో అడుగులో ఈ డిసెంబర్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో గెలుస్తాం. నాలుగో దేశమంతా గెలిచి ఎర్రకోట మీద కాంగ్రె జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
