ఖమ్మం(Khammam) ఎన్టీఆర్(NTR) విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్(High court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ కృష్ణ జాక్, అధిబాట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘాల‌ ఆధ్వ‌ర్యంలో హైకోర్ట్‌లో దాఖ‌లైన దాదాపు ప‌లు పిటీష‌న్ల‌పై కోర్టు గురువారం విచార‌ణ జ‌రిపింది.

ఖమ్మం(Khammam) ఎన్టీఆర్(NTR) విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్(High court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీ కృష్ణ జాక్, అధిబాట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘాల‌ ఆధ్వ‌ర్యంలో హైకోర్ట్‌లో దాఖ‌లైన దాదాపు ప‌లు పిటీష‌న్ల‌పై కోర్టు గురువారం విచార‌ణ జ‌రిపింది. ఈ విష‌య‌మై క‌రాటే క‌ళ్యాణి(Karate Kalyani) ఓ ఆడియో(Audio) బైట్ విడుద‌ల చేశారు. ధ‌ర్మం గెలిచింద‌ని అన్నారు. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని 28న ప్ర‌తిష్టించ‌వ‌ద్ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింద‌ని పేర్కొన్నారు. త‌దుప‌రి విచార‌ణ‌లో వాద‌న‌లు వింటామ‌ని.. అప్ప‌టివ‌ర‌కూ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న ఆపాల‌ని జ‌డ్జి తీర్పు వెల్ల‌డించార‌ని పేర్కొన్నారు. జై శ్రీ కృష్ణ‌.. అంద‌రి క‌ష్టాలు ప‌లించాయి.. కంగ్రాట్స్ టూ ఎవ్రీ వ‌న్.. అంటూ ఆడియో క్లిప్ విడుద‌ల చేశారు.

Updated On 18 May 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story