సమయానికి సాగునీరు అందక ఎండిపోయిన పంటలను చూస్తూ దిగాలు పడుతున్నారు రైతులు. అకాల వర్షాలు రైతుల(Rains) ఆశలపై నీళ్లు చల్లాయి. మొత్తంగా తెలంగాణలో రైతులు ఆగమాగమవుతున్నారు. వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి భరోసా కల్పించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటిస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది.

సమయానికి సాగునీరు అందక ఎండిపోయిన పంటలను చూస్తూ దిగాలు పడుతున్నారు రైతులు. అకాల వర్షాలు రైతుల(Rains) ఆశలపై నీళ్లు చల్లాయి. మొత్తంగా తెలంగాణలో రైతులు ఆగమాగమవుతున్నారు. వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి భరోసా కల్పించనున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటిస్తారని బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది. ఓ పక్క సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరో పక్క అకాల వర్షాలు పంటను దెబ్బతీశాయి. ఇంకో పక్క రైతు బంధు(Rythu bandhu) అందలేదు. బ్యాంకుల నోటీసులు మాత్రం అందుతున్నాయి. సమస్యల వలయంలో చిక్కుకున్న రైతు అల్లాడిపోతున్నాడు. భవిష్యత్తుపై భయంతో బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ నిలుస్తోంది. కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 31న జనగామ, సూర్యాపేట(Suryapet), నల్లగొండ(Nalgonda) జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటపొలాలను పరిశీలించి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడినుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అర్వపల్లికి వెళతారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటంచి రైతులకు ధైర్యం చెబుతారు.

Updated On 30 March 2024 3:08 AM GMT
Ehatv

Ehatv

Next Story