హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని.. కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేస్తోందని అన్నారు

‘దళిత బంధు’ లబ్ధిదారుల ఖాతాల్లోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోతే 1.30 లక్షల మంది దళితులతో కలిసి 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపడతామని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు రూ. 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి రూ. 10 లక్షలు కూడా ఇవ్వలేకపోయిందని.. 1.30 లక్షల మంది దళితులకు దళిత బందు మంజూరు చేసినప్పటికీ ఖాతాలను స్తంభింపజేసి, కార్యకలాపాలను నిలిపివేసి, నిధులను వెనక్కి తీసుకుందని విమర్శించారు.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని.. కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేస్తోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విధానపరమైన దిశానిర్దేశం చేయకపోవడాన్ని కేసీఆర్ విమర్శించారు. వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తమ హయాంలో రైతు బంధు, నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలతో రైతుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి భరోసా ఇచ్చామని కేసీఆర్ అన్నారు. దళిత బంధు లబ్దిదారులకు రూ.10 లక్షలు విడుదల చేసే వరకు 1.30 లక్షల మంది దళితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని, వివిధ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేసీఆర్ అన్నారు.

Updated On 13 April 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story