తెలంగాణ(Telangana) అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(TRS Party) పేరును అనవసరంగా బీఆర్‌ఎస్‌గా(BRS) మార్చారన్నది చాలా మంది కార్యకర్తల అభిప్రాయం. ఆ మాటకొస్తే నాయకుల్లో కూడా ఈ రకమైన భావనే ఉంది. టీఆర్‌ఎస్‌లో తెలంగాణ కనిపించేది. తెలంగాణ వినిపించేది. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత క్యాడర్‌లో ఉద్వేగం కనిపించకుండా పోయింది. ఉత్సాహం కనుమరుగయ్యింది.

తెలంగాణ(Telangana) అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(TRS Party) పేరును అనవసరంగా బీఆర్‌ఎస్‌గా(BRS) మార్చారన్నది చాలా మంది కార్యకర్తల అభిప్రాయం. ఆ మాటకొస్తే నాయకుల్లో కూడా ఈ రకమైన భావనే ఉంది. టీఆర్‌ఎస్‌లో తెలంగాణ కనిపించేది. తెలంగాణ వినిపించేది. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత క్యాడర్‌లో ఉద్వేగం కనిపించకుండా పోయింది. ఉత్సాహం కనుమరుగయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వెనుక ప్రధాన కారణాలలో పార్టీ పేరు మార్పు కూడా ఒకటన్న వాస్తవం ఇప్పుడిప్పుడే పార్టీ అధినాయకత్వానికి తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అంటేనే కేసీఆర్‌. అందుకే కేసీఆర్‌(KCR) ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట! బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారట! ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా చెప్పారు. పాల‌కుర్తిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశాల్లో బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాల‌ని కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశార‌న్నారు. దీంతో ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం, కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు వెల్లువెత్తుతుండ‌డంతో కేసీఆర్‌, ఆయ‌న ముఖ్యుల‌కు త‌త్వం బోధ‌ప‌డిందట! పార్టీ నిర్మాణం మొదట్నుంచి మళ్లీ చేయాలనే నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారట! ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గ‌త‌ పేరుతోనే మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Updated On 6 April 2024 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story