వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత 102 కు పెంచుకున్నామన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) గురువారం నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత 102 కు పెంచుకున్నామన్నారు. గత ప్రభుత్వాల పాలనలో గాంధీ(Gandhi Hospital), ఉస్మానియా (Osamania), నిమ్స్(NIMS) తప్ప మరో పెద్ద ఆసుపత్రి లేదని.. ఇప్పుడు నగరం నలుమూలల టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ లో హెల్త్ సిటీ(warangal Health City) నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. వైద్యుల సంఖ్యను కూడా పెంచుతున్నామని వెల్లడించారు.
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం డెలివరీలు అయ్యేవి.. ఇప్పుడు 64 శాతానికి పెరిగిందని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉత్తమ వైద్యం అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లను బలోపేతం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. లెవల్ 1, 2, 3గా వర్గీకరించి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేట్ తరహాలో అత్యవసర సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డెలివరీ మహిళల కోసం, రేపటి తరం ఆరోగ్యం కోసం మరో రెండు వారాల్లో రూ.250 కోట్ల నిధులతో కేసీఆర్(KCR) న్యూట్రీషియన్ కిట్(Nutrition Kit Program) అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. ఈ కిట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర లక్షల మంది గర్భిణీలు లబ్దిపొందనున్నారని పేర్కొన్నారు.