కేసీఆర్‌(KCR) క్లాసైన మాస్‌ లీడర్..నిఖార్సైన ఉద్యమనాయకుడు. కేసీఆర్‌ అన్న పదంలో వైబ్రేషన్‌ ఉంది. ఆ వైబ్రైషన్‌ తెలంగాణ ప్రజల గుండెచప్పుడు. ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించి వింటారు. ఇంటర్వ్యూలప్పుడు టీవీలకు(TV9) అతుక్కుపోతారు. ఆయన చెప్పిందే చెప్పినా వినసొంపుగా ఉంటుంది కాబట్టి జనం ఆసాంతం చూస్తారు. మంగళవారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూ కేసీఆర్‌ క్రేజ్‌ ఏమిటో చాటి చెప్పింది.

కేసీఆర్‌(KCR) క్లాసైన మాస్‌ లీడర్..నిఖార్సైన ఉద్యమనాయకుడు. కేసీఆర్‌ అన్న పదంలో వైబ్రేషన్‌ ఉంది. ఆ వైబ్రైషన్‌ తెలంగాణ ప్రజల గుండెచప్పుడు. ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించి వింటారు. ఇంటర్వ్యూలప్పుడు టీవీలకు(TV9) అతుక్కుపోతారు. ఆయన చెప్పిందే చెప్పినా వినసొంపుగా ఉంటుంది కాబట్టి జనం ఆసాంతం చూస్తారు. మంగళవారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూ కేసీఆర్‌ క్రేజ్‌ ఏమిటో చాటి చెప్పింది. తన రికార్డును తానే బద్దలు కొట్టారు కేసీఆర్‌. నాలుగు గంటలపాటు ఏకధాటిగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రికార్డు వ్యూస్‌ను సాధించింది. 95 వేలకు పైగా నాన్‌స్టాప్‌ లైవ్‌ వ్యూస్‌ వచ్చాయి. తెలుగు మీడియా రంగంలో ఇదో రికార్డు. ఏదైనా సినిమా ఫంక్షన్‌కో, లేక సినీ తారల వేడుకలకో భారీ లైవ్‌ వ్యూస్‌(Live Views) వస్తాయి కానీ ఇలా ఓ పొలిటిషిన్‌కు(Politician) ఇన్నేసి వ్యూస్‌ రావడం ఇదే ప్రథమం. పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు ఇలా ప్రతిచోటా లక్షలాది మంది జనం టీవీకి అతుక్కుపోయారు. కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు తమ నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ చెబుతున్న ఒక్కో మాటకు జనం నుంచి హర్షం వ్యక్తం అయ్యింది. చిన్నారులు మొదలు వృద్ధుల వరకూ టీవీలకు, మొబైల్‌లో యూట్యూబ్‌కు అతుక్కుపోయారు. వేలాదిగా కామెంట్లు వచ్చాయి. అంతకు మూడు రెట్లు లైకులు వచ్చాయి. ఇరిగేషన్‌, విద్యుత్తు, ఆర్థిక, తాగునీటి తదితర రంగాలపై ఆయన చెప్పిన విశ్లేషణలను శ్రద్ధగా విన్నారు. ఇప్పడు కూడా కేసీఆర్‌ ఇంటర్వ్యూ గురించే జనం మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్‌ మారథాన్ ఇంటర్వ్యూను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ 'మాస్టర్‌ క్లాస్‌'గా అభివర్ణంచారు. ఫామ్‌ టెంపరరీ, క్లాస్‌ పర్మినెంట్‌ అనడానికి ఇదే లైవ్‌ ఎగ్జాంపుల్ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Updated On 24 April 2024 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story