బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మహారాష్ట్రలోని ఓ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తెలంగాణకు సరిహద్దులో ఉన్న మ‌హారాష్ట్ర‌లోని ఓ లోక్‌స‌భ‌ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు(BRS President), తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR).. మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ లోక్‌సభ(Loksabha) నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తెలంగాణకు సరిహద్దులో ఉన్న మ‌హారాష్ట్ర‌లోని ఓ లోక్‌స‌భ‌ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి(Chief Minister) ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ది న్యూ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్(The New Indian Express) నివేదిక‌ ప్రకారం.. కేసీఆర్‌ తదుపరి సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థులను నిలబెట్టడానికి ఇతర రాష్ట్రాల ఓటర్ల పల్స్‌ను తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన జాతీయ ఎన్నికల ఏజెన్సీ సిసిరో(Cicero Election Agency) చేప‌ట్టిన‌ సర్వేను ప‌రిశీలించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సిసిరో(Cicero).. రాష్ట్రీయ జనతాదళ్(Rashtriya Janata Dal), సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party), అనేక ప్రముఖ వార్తా ఛానెల్‌లతో సహా వివిధ పార్టీలకు ఎన్నికల సర్వే(Election Survey) సేవలను అందించింది. గత నెలలో ఏజెన్సీ.. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పోటీకి తగిన నియోజకవర్గాలను గుర్తించేందుకు సర్వే ప్రారంభించిందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), మహారాష్ట్ర, తమిళనాడు(Tamil Nadu), మధ్యప్రదేశ్(Madhya Pradesh), కర్ణాటక(Karnataka)లలో బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన విభాగాలను గుర్తించేందుకు ఏజెన్సీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ఈ రాష్ట్రాల నుంచి సినీ ప్రముఖులను ఎంపిక చేయాలని బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నట్లు సమాచారం. మూలాల ప్రకారం.. మే 2022లో ముఖ్యమంత్రిని కలిసిన తమిళ నటుడు(Tamil Actor) విజయ్‌(Hero Vijay)తో పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ విస్తరణ‌లో భాగంగా కేసీఆర్‌ గత నాలుగు నెలల్లో మహారాష్ట్రలో అనేక బహిరంగ సభ(Public Meetings)లు నిర్వ‌హించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా(Odisha), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)ల నుండి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్‌ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ నాయకులతో.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)లో సాధ్యమయ్యే పరిణామాలపై చర్చిస్తున్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు(Rythu Bandhu), రైతు బీమా(Rythu Bima), కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak), రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్(24-hour free power for farmers) వంటి పథకాలపై ఆయా రాష్ట్రాల్లోని ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్(Feedback) తీసుకోవాలని బీఆర్‌ఎస్ చీఫ్.. సర్వే ఏజెన్సీని కోరినట్లు సమాచారం.

గతంలో కరీంనగర్(Karimnagar), మెదక్(Medak), మహబూబ్‌నగర్(Mahbubnagar) లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజ‌యం సాధించిన కేసీఆర్.. మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగాలని తీసుకున్న నిర్ణయం.. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుందని భావిస్తున్నారు.

2022 అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రారంభ స‌మ‌యంలో జేడీఎస్ నేత(JDS Leader), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(HD Kumaraswamy)ని కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Karnataka Election Results) తర్వాత ఈ రెండు పార్టీల నేతలు ఒక్కసారి కూడా కలవలేదు. వీరు భ‌విష్య‌త్‌లో క‌లుస్తార‌న్న ఊహాగానాల‌ను కొట్టిప‌డేయ‌లేం. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిమాని అయిన నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj).. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై క‌ర్ణాట‌క‌లో బ‌రిలో నిలువ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌కాశ్ రాజ్‌ గత ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్(Banglore Central) నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఊహాగానాల‌న్నింటికీ చెక్ ప‌డాలంటే.. ఎన్నిక‌ల షెడ్యూల్ ప‌డాల్సిందే.

Updated On 16 July 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story