నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, పాల్వాయి, ఆరుట్ల కమలాదేవి, చకిలం శ్రీనివాసరావు లాంటి నాయకులు గుర్తొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నల్గొండ నిరుద్యోగ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. బండెనక బండి కట్టి అని నైజాం సర్కారును ప్రశ్నించిన బండి యాదగిరిది ఈ గడ్డ.. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఈ నల్లగొండ బిడ్డ అని పేర్కొన్నారు.

KCR jeopardising lives of lakhs of unemployed youth
నల్లగొండ జిల్లా అంటే రావి నారాయణ రెడ్డి(Ravi Narayana Reddy), మల్లు స్వరాజ్యం(Mallu Swarajyam), పాల్వాయి(Palwai Govardhan Reddy), ఆరుట్ల కమలాదేవి(Arutla Kamaladevi), చకిలం శ్రీనివాసరావు(Chakilam Srinivasa Rao) లాంటి నాయకులు గుర్తొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. శుక్రవారం సాయంత్రం నల్గొండ నిరుద్యోగ నిరసన(Nalgonda Nirudyoga Nirasana) సభలో ఆయన మాట్లాడుతూ.. బండెనక బండి కట్టి అని నైజాం సర్కారును ప్రశ్నించిన బండి యాదగిరిది(Bandi Yadgiri) ఈ గడ్డ.. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి(Srikanth Chari) ఈ నల్లగొండ బిడ్డ అని పేర్కొన్నారు. జేఏసీ అంటే జానా యాక్షన్ కమిటీ అని ఇక్కడి ప్రజలకి నేను గుర్తు చేయదలచుకున్నాను. పదవులను ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ అన్నాడు. సెలక్షన్లు, కలెక్షన్లు అంటూ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు కేసీఆర్. తొలి తెలంగాణ ఉద్యమంలో పదవులు త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji). మలి దశ ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అని గుర్తుచేశారు.
అలాంటి నేతలు ఉన్న నల్లగొండలో ఇప్పుడు ఎలాంటి నాయకులను చూస్తున్నాం? దొరగారి సారాలో సోడా పోసేవారు ఈ జిల్లా నుంచి మంత్రి అయిండని ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాకు గౌరవం ఉంటుందా..? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్(KCR).. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటా ను చేసి నువ్వు చార్లెస్ గా మారడమేనా బంగారు తెలంగాణ? అని ఎద్దేవా చేశారు. లక్షలాది బిడ్డల జీవితాలను వందలాది కోట్లకు కేసీఆర్, అతని కుటుంబం అమ్ముకుందని ఆరోపించారు.
తెలంగాణ(Telangana)లో పరీక్షలు(Exams) రాయించలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇదేనా నీ తెలంగాణ మోడల్? అంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని మేం చెబితే ఖండించారు. సీఎం కేసీఆర్ లంచాలు తీసుకున్న వారి చిట్టా తన దగ్గర ఉందన్నారు. 30 శాతం కమీషన్లు తీసుకునే సర్కారు మనకు అవసరమా? 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి తెచ్చిన తెలంగాణలో పేదలు పెదలుగానే బతకాలా? కేసీఆర్ కుటుంబం రాజ్యాలు ఏలితుంటే.. పేదల బిడ్డలు కుల వృత్తులు చేసుకుని బతకాలా? నిరుద్యోగులు అడ్డా మీద కూలీల్లా బతకాల్సిందేనా? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నల వర్షం కురిపించారు.
పరీక్షలు నిర్వహించాల్సిన సీఎం.. పార్టీ విస్తరణ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జనతా బార్ లో పర్మిట్ రూమ్ అడ్డాల్లా మారాయని ఎద్దేవా చేశారు. పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనలంటూ తాగి చిందులు వేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్ సర్కారును 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అది జరగాలంటే నల్లగొండలో 12కు 12 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. మీరు 12కు 12 గెలిపించండి.. రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) మే మొదటివారంలో ఈ గడ్డకు రాబోతున్నారు. సరూర్ నగర్ సభకు వేలాదిగా తరలిరండని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేసుకుందాం అని రేవంత్ పేర్కొన్నారు.
