ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు(BRS) 105 సీట్లు గ్యారంటీగా వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కొండంత ధీమాతో చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేసీఆర్(KCR) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు(BRS) 105 సీట్లు గ్యారంటీగా వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కొండంత ధీమాతో చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేసీఆర్(KCR) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ పదేళ్ల కాంలో ప్రజలకు మనం చేసింది చెప్పుకుంటే చాలని, గెలుపు మనదే అవుతుందని కేసీఆర్ అన్నారు.
'రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి. అది సరిపోతుంది' అని తెలిపారు. ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవడం పక్కా అని పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్(Congress) పార్టీ చేసిందేమీ లేదని, అందుకే వాళ్లను జనం నమ్మరని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం పైనా చర్చించారు. మంత్రులు ఆయా జిల్లాలలో ఉత్సవాలు పర్యవేక్షించాలని ఆదేశించారాయన.