KCR : కేసీఆర్‌ను ఏమనాలి తొలి సీఎం అనా.. మాజీ సీఎం అనా...!
తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువైంది. ముఖ్యమంత్రిగా రేవంత్(CM Revanth), మరో 11 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. కాంగ్రెస్(Congress) పాలన ఇప్పుడిప్పుడే జోరందుకుంది. సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టాక ఐపీఎస్(IPS), సీఎంవో కూర్పు, పాలనపై ఫోకస్ పెట్టారు. 39 స్థానాలతో బీఆర్‌ఎస్‌కు(BRS) ప్రతిపక్ష హోదా దక్కింది. కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కూడా ఎన్నుకున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని(Farm house) బాత్‌రూంలో జారిపడి యశోద(Yashoda) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పలువురు పరామర్శిస్తున్నారు. మంగళవారం తనను పరామర్శించడానికి వచ్చిన అభిమానులను ఉద్దేశిస్తూ వీడియో(Video) సందేశం పంపించారు.
తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువైంది. ముఖ్యమంత్రిగా రేవంత్(CM Revanth), మరో 11 మంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. కాంగ్రెస్(Congress) పాలన ఇప్పుడిప్పుడే జోరందుకుంది. సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టాక ఐపీఎస్(IPS), సీఎంవో కూర్పు, పాలనపై ఫోకస్ పెట్టారు. 39 స్థానాలతో బీఆర్‌ఎస్‌కు(BRS) ప్రతిపక్ష హోదా దక్కింది. కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కూడా ఎన్నుకున్నారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని(Farm house) బాత్‌రూంలో జారిపడి యశోద(Yashoda) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పలువురు పరామర్శిస్తున్నారు. మంగళవారం తనను పరామర్శించడానికి వచ్చిన అభిమానులను ఉద్దేశిస్తూ వీడియో(Video) సందేశం పంపించారు. తనను కలవడానికి వస్తే ఇన్‌ఫెక్షన్ (Infection)పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారని.. కోలుకున్న తర్వాత అందరినీ కలుసుకుంటానని, ఇక్కడికి వచ్చి ఇతర పేషెంట్లను ఇబ్బంది పెట్టవద్దని స్వతహాగా ప్రజలకు విజ్ఞప్తి(Request) చేశారు.
ఈ క్రమంలో కేసీఆర్‌ను(KCR) ఎలా సంబోధించాలనే విషయంపై సోషల్ మీడియాలో(Social media) చర్చ నడుస్తోంది. కేసీఆర్‌ను తొలి ముఖ్యమంత్రి అనాలా, లేదా మాజీ ముఖ్యమంత్రి(Former CM) అనాల అన్న అంశంపై సోషల్ మీడియా వేదికగా హాట్‌హాట్ డిస్కషన్(Discussion) నడుస్తోంది. ఈ అంశంపై బిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్ అనుకూల మీడియాలో కేసీఆర్‌ను తొలి సీఎం(First CM) కేసీఆర్ అంటున్నారు. కొందరేమో మాజీ సీఎం కేసీఆర్ అని సంబోధిస్తున్నారు. వాస్తవానికి ఇవి రెండూ కరెక్ట్ పదాలే. తొలి ముఖ్యమంత్రి అనడం ఎందుకు అని కొందరు వాదిస్తుండగా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనడంలో వాస్తవం లేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, రాష్ట్రానికి వరుసగా రెండు సార్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారని.. అలాంటప్పుడు ఆయనను తొలి సీఎం అనడంలో తప్పు ఎలా అవుతుందని కేసీఆర్ అనుకూల వర్గం వారు వాదిస్తున్నారు. జవహార్‌లాల్ నెహ్రూను(Jawaharlal nehru) భారత తొలి ప్రధాని అనే సంబోధిస్తామని.. భారత మాజీ ప్రధాని అని అనట్లేదని వారి వాదన. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైనందున.. ఆయన సీఎం పదవి పోయిందని.. అప్పుడు కేసీఆర్‌ను మాజీ సీఎం అంటే కలిగే నష్టమేంటని మరొక వర్గం వాదన. ఎవరికి నచ్చినట్లు వారు కేసీఆర్‌ను సంబోధించుకోవచ్చని, ఎవరినీ తప్పుపట్టడానికి లేదని రాజకీయ మేధావులు భావిస్తున్నారట.