తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాల నుంచి ఎనిమిది వారాలు పడుతుందని డాక్టర్లు అంటున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌కు రెండు నెలలు గడిస్తే కానీ ఆ పదవీ వైభవం రాదన్నమాట! అసలు ఆయన అసెంబ్లీకి వస్తారో రారో అన్నది చాలా మందికి వస్తున్న డౌటానుమానం.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాల నుంచి ఎనిమిది వారాలు పడుతుందని డాక్టర్లు అంటున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌కు రెండు నెలలు గడిస్తే కానీ ఆ పదవీ వైభవం రాదన్నమాట! అసలు ఆయన అసెంబ్లీకి వస్తారో రారో అన్నది చాలా మందికి వస్తున్న డౌటానుమానం. తొమ్మిదన్నరేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చోవాలంటే కాస్త ఇబ్బందే. పూలమ్మిన చోట కట్టలమ్మడం అంటే ఇదే! ఎడమ తుండి ఎముకకు ఫ్రాక్చర్‌ కావడంతో ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ జరుగుతుంది. తిరిగి ఆయన కోలుకవడానికి ఎనిమిది వారాల సమయం పట్టొచ్చు. అంటే రెండు నెలల పాటు కేసీఆర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ శనివారం కొలువుతీరనుంది. ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేలంతా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరయ్యే ఛాన్సే లేదు. రెండు నెలల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వొచ్చు.

Updated On 8 Dec 2023 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story