KCR Delhi Residence : ఢిల్లీ నివాసంతో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకున్న కేసీఆర్
ఏ ముహూర్తానా తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) తన పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా(BRS) అవతరించిందో అప్పట్నుంచి ఆ పార్టీకి దిష్టి తగిలినట్టుగా ఉంది. అదే జరగకపోతే ఇంతటి పరాభవం ఎదురుకాదేమో! టీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీగా భావించిన ప్రజలకు ఇప్పుడా భావన లేకుండా పోయిందేమో! పేరు మార్పు మంచిదో కాదు కాలం నిర్ణయిస్తుంది.
ఏ ముహూర్తానా తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) తన పేరు మార్చుకుని భారత రాష్ట్ర సమితిగా(BRS) అవతరించిందో అప్పట్నుంచి ఆ పార్టీకి దిష్టి తగిలినట్టుగా ఉంది. అదే జరగకపోతే ఇంతటి పరాభవం ఎదురుకాదేమో! టీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీగా భావించిన ప్రజలకు ఇప్పుడా భావన లేకుండా పోయిందేమో! పేరు మార్పు మంచిదో కాదు కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ పేరుతో ఉన్న బంధాన్ని పార్టీ ఎలాగైతే తెంచుకుందో ఢిల్లీలోని తుగ్లక్(Thuglak) రోడ్‌లో ఉన్న అధికార నివాసంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(KCR) ఉన్న సుదీర్ఘ అనుబంధం కూడా తెగిపోయింది. ఒకటా రెండా.. సుమారు 20 ఏళ్లుగా అధికార నివాసం ఉంటున్న భవంతిని ఇప్పుడు కేసీఆర్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2004లో టీఆర్‌ఎస్ తరఫున కరీంనగర్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ అప్పుడు మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రి హోదాలో ప్రభుత్వం ఆయనకు తుగ్లక్ రోడ్డులోని టైప్ 8 క్వార్టర్‌ను కేటాయించింది. 2006లో కేంద్రమంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో ఘన విజయం సాధించి మళ్లీ అదే క్వార్టర్‌లో నివాసం ఉన్నారు. 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ(Lok Sabha) నియోజకవర్గం నుంచి ఎన్నికన కేసీఆర్ ఆ నివాసంలోనే కొనసాగారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్రప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఆ సంప్రదాయంలో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్(Nizamabad) ఎంపీగా గెలిచిన కేసీఆర్ కూతురు కవిత కూడా ఆ భవంతినే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అప్పట్నుంచి ఆ క్వార్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎంపీ కవితకు అధికార నివాసంగా ఉంటూ వచ్చింది. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగించారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌ను ఖాళీ చేశారు. అలాగే ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని కూడా ఖాళీ చేయబోతున్నారు కేసీఆర్. ఇందుకు మూడు రోజుల సమయం అడిగారు.