తెలంగాణ(Telangana) నుంచి మరో భారీ పెట్టుబడి గుజరాత్‌కు(Gujarat) తరలిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలో చిప్ తయారీ యూనిట్ను(Chip Unit Company) నెలకొల్పడానికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంతో అయిదు నెల లకిందట కెయిన్స్ టెక్ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది.
తెలంగాణ(Telangana) నుంచి మరో భారీ పెట్టుబడి గుజరాత్‌కు(Gujarat) తరలిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలో చిప్ తయారీ యూనిట్ను(Chip Unit Company) నెలకొల్పడానికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంతో అయిదు నెల లకిందట కెయిన్స్ టెక్ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది. ఇప్పుడు కెయిన్స్ టెక్ ఆ ఆలోచనను విరమించుకుందట! చిప్ తయారీ యూనిట్‌ను తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నదట! గుజరాత్‌లోని సనంద్‌లో ఔట్ సోర్సింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను కెయిన్స్ టెక్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమారు 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. సనంద్‌లో ఇప్పటికే అమెరికన్ సంస్థ మైక్రాన్, మురుగప్ప గ్రూప్ చిప్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ అధికారులను అడిగితే తమకు సమాచారం లేదని అంటున్నారు.