Kasani Gnaneswar : రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ టీడీపీ(TTDP) అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneswar) రేపు బీఆర్ఎస్(BRS) తీర్ధం పుచ్చుకోనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం(Gajwel constituency) ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో(Erravalli Farm House) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ టీడీపీ(TTDP) అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneswar) రేపు బీఆర్ఎస్(BRS) తీర్ధం పుచ్చుకోనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం(Gajwel constituency) ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో(Erravalli Farm House) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పరిమిత సంఖ్యలో తన అనుచరగణంతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకొనున్నారు.
గతవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నారా చంద్రబాబును(Nara Chandrababu) కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ ద్వారా కలిశారు. అప్పుడే తెలంగాణ ఎన్నికల(Telangana Elections) విషయమై చర్చించారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టలేమని.. పోటీ చేయొద్దని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కాసాని తన ఆవేదనను వెల్లగక్కుతూ చంద్రబాబు, నారా లోకేష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.