తెలంగాణ‌ టీడీపీ(TTDP) మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneswar) బీఆర్ఎస్‌(BRS) పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్(Erravalli Farm house) లో సీఎం కేసీఆర్(KCR) కాసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ‌ టీడీపీ(TTDP) మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneswar) బీఆర్ఎస్‌(BRS) పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్(Erravalli Farm house) లో సీఎం కేసీఆర్(KCR) కాసానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుండి వెళ్లిపోయిన ఈటల రాజేందర్(Etala Rajendar) కంటే పెద్దమనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని అన్నారు. ఈటల బీఆర్ఎస్‌లో ముదిరాజ్‌లను ఎదగనివ్వలేదని మండిపడ్డారు. నామినేటేట్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయని.. గెలవని చోట ముదిరాజ్‌ అభ్యర్థులను తమాషాకు నిలబెట్టవద్దన్నారు. బండ ప్రకాష్ ముదిరాజ్‌ను పార్టీలోకి తీసుకువచ్చి పదవి ఇచ్చామని.. బీఆర్ఎస్‌లో ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ, రాజ్య సభ పదవులు దక్కుతాయని ఉద‌హ‌రించారు. ఎన్నికల తర్వాత ముదిరాజ్‌లతో సమావేశమవుతానని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated On 3 Nov 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story