టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కామారెడ్డిలో(Kamareddy) నామినేష‌న్‌కు(Nomination) వేసేందుకు వెళ్లారు. కాగా అక్క‌డ ఆయ‌న‌కు కేసీఆర్(KCR) పూర్వీకుల గ్రామమైన‌ కొనాపూర్(Konapur) కు చెందిన గ్రామస్తులు నామినేషన్ డబ్బులను అందజేశారు.

టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కామారెడ్డిలో(Kamareddy) నామినేష‌న్‌కు(Nomination) వేసేందుకు వెళ్లారు. కాగా అక్క‌డ ఆయ‌న‌కు కేసీఆర్(KCR) పూర్వీకుల గ్రామమైన‌ కొనాపూర్(Konapur) కు చెందిన గ్రామస్తులు నామినేషన్ డబ్బులను అందజేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డికి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని గ్రామస్తులు తెలిపారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ కేసీఆర్‌(KCR)పై గ్రామ‌స్తులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. రేవంత్ రెడ్డి కొడంగ‌ల్(Kodangal) నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్క‌డ ఆయ‌న కొద్దిరోజుల క్రితం నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌లో కొడంగ‌ల్ నుంచి ఓడిపోయారు. రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి రాజ‌కీయ ఆరంగ్రేటం చేశారు. అనంత‌రం 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానికసంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ త‌ర్వాత కొడంగ‌ల్ నుంచి రెండు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

Updated On 10 Nov 2023 3:16 AM GMT
Ehatv

Ehatv

Next Story