కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది సవాళ్లు, ప్రతి సవాళ్లలో పేర్కొన్నట్లుగా.. రహదారి వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చివేసి తన మాటను నిలబెట్టుకున్నాడు.

కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Katipalli Venkata Ramana Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది సవాళ్లు, ప్రతి సవాళ్లలో పేర్కొన్నట్లుగా.. రహదారి వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చివేసి తన మాటను నిలబెట్టుకున్నాడు. అలాగే మరికొందరిని కూడా రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్(Old Bustop) నుంచి రైల్వే గేటు(Railway Gate) వరకూ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 80 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పుడు 30 అడుగులు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయకుండా చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయిలు, షెడ్లు ఏర్పాటు చేశారు.

అయితే రోడ్డు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటి నుంచి వెళ్లే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న త‌న‌ ఇంటిని కూల్చివేసి అధికారులకు అప్పగించాడు. ఈ రోజు ఉదయం R&B, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీతో ఇంటిని కూల్చివేశారు. పంచముఖి హనుమాన్ దేవాలయం(Hanuman Temple) కూడా ఇదే దారిలో ఉన్నందున ఆలయానికి నష్టం జరగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

వారం రోజుల్లోగా రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్లను స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 24 అడుగుల రోడ్డును నెల రోజుల్లోగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు నిర్మించే ఈ రోడ్డులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. ఆయన స్పందన కోసం కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated On 27 Jan 2024 3:11 AM GMT
Yagnik

Yagnik

Next Story