కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిశారు. 46 ఏళ్ల కవితను ఏప్రిల్ 11న తీహార్ జైలులో సీబీఐ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను అరెస్టు చేసిన తర్వాత.. ప్రత్యేక కోర్టు ఆమెను ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. సీబీఐ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ తన సోదరితో అరగంట సేపు మాట్లాడారు.

కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట కవితను హాజరుపరచనున్నారు. ఉదయం 10 గంటలకు జడ్జి కావేరీ బవేజా ఎదుట కవితను ప్రవేశపెడతారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు విషయాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. సీబీఐ మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది.

Updated On 14 April 2024 9:15 PM GMT
Yagnik

Yagnik

Next Story