మాజీమంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ..

Kadiam Srihari should be suspended from the party
బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) మండలం తాటికొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. ఎంపీలు గానీ, ఎమ్మెల్సీలు గానీ స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతనే నియోజకవర్గం(Constituency)లోకి రావాలి.. 2014 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కడియం శ్రీహరి కార్యక్రమాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరిని పార్టీ నుండి సస్పెండ్(Suspend) చేయాలని డిమాండ్ చేశారు.
2014 -18 ఎన్నికల సమయంలో నా ఆస్తులు(Assets) మొత్తం అమ్ముకున్నానని వాపోయారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తులు ఎంత.? ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడాలన్నారు. కడియం శ్రీహరి దేవాదుల(Devadula Project) సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల(Encounters) సృష్టికర్త అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ(Telangana)లోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో(United Andhra Pradesh) కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగాయి.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని బాగా జరిగాయని అన్నారు.
