1978 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో రకరకాల రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చినా 1989లో ఓడిపోయారు.

Kadiyam Srihari Comments on Congress Govt
1978 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో రకరకాల రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఎన్టీఆర్(NTR) ఎన్నో సంస్కరణలు తెచ్చినా 1989లో ఓడిపోయారు. మళ్ళీ 1994లో కాంగ్రెస్(Congress) ను ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అన్నారు. మహబూబాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇపుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారని.. రాజకీయాల్లో ఇది సహజమన్నారు. ఓటమి గురించి ఎక్కువ భాధ పడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్ మనదేనని.. 2028లో అధికారం బీఆర్ఎస్(BRS)దేనని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో అపుడే కుమ్ములాటలు మొదలయ్యాయని.. పొంగులేటి తానే నెంబర్ -2 అంటున్నారు.. భట్టికి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని.. కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరేనని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదన్నారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లు కృష్ణార్జునులు.. వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత లేదన్నారు. దళిత బంధు కింద కేసీఆర్(KCR) పది లక్షలు ఇస్తే దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టో(Manifesto) లో పెట్టిందని.. గతం లో ఎంపికైన దళిత బంధు లబ్దిదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. దళితులతో రాజకీయ చెలగాటం తగదన్నారు. మహబూబాబాద్ లో కష్టపడి పనిచేసి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు.
