ఈసారి పాల్ తెలంగాణాలో జరుతున్న పరిణామాలపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
కేఏ పాల్ మరోసారి పొలిటికల్ సీన్ లోకి వచ్చారు. తన కామెంట్స్ తో మరోసారి జనాలను ఆకర్శిచే ప్రయత్నం చేశారు. ఈసారి పాల్ తెలంగాణాలో జరుతున్న పరిణామాలపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
ఈమధ్య కాస్త కూల్ అయిన కేఏ పాల్ మరోసారి ఫామ్ లోకివచ్చాడు. మొన్నటి వరకూ ఆంధ్ర ఎలక్షన్లు హడావిడి, పొటికల్ కామెంట్లు.. ఎన్నికల రిజల్ట్, ఆతరువాత కొంత కాల ప్రభుత్వంపై కామెంట్లు..ఇలా నడిపించిన పాల్.. ఈమధ్య కాస్త కామ్ అయ్యారు. ఇక తాజాగా తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలతో మరోసారి ఫామ్ లోకివ వచ్చారు కేఏ పాల్. తెలంగాణ ప్రభుత్వంపై.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తనదైన మార్క్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గొడవలు ఎక్కువయ్యాయని. గతంలో ఉన్నప్రశాంతత లేకుండా పోయిందని.. ప్రజాశాంతి పార్టీ తరుపున వాయిస్ వినిపించారు.. కేఏ పాల్. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ధర్నాలు, గొడవలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పాల్ అన్నారు.
ఒకరోజు రైతులతో గొడవ జరిగితే వారికి బేడీలు వేయిస్తాడు. ఆ తర్వాత సర్పంచులు సమస్యలు చెప్పుకుందాం అని వస్తే వారిని అరెస్టు చేయిస్తాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి అని అడిగితే.. వారిని కూడా అరెస్టు చేసి నోర్లు మూయిస్తాడు. పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తున్నాడు.. ఏంటి ఇదంతా. అంటూ ప్రాజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రేవంత్ ఒక సద్దాం హుస్సేన్(Saddam Hussein) లాగా, ఒక గడాఫీ(Gaddafi) లాగా ఒక డిక్టేటర్‌లా మారిపోయాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు చట్ట విరుద్దంగా రేవంత్ వెళ్తున్నాడని.. తన సొంత చట్టం అమలు చేస్తున్నాడని.. 482 భవనానలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశాడు. కానీ తమ్ముడి బిల్డింగ్ మాత్రం కూల్చకుండా వదిలేశాడు అంటూ కేఏ పాల్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇటు అల్లు