బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishnarao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy)లు ఏ పార్టీలో చేరుతారనే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది. ఓ వైపు బీజేపీలో, మరో వైపు కాంగ్రెస్ లో చేరుతారంటూ వ్యాఖ్యలు.. మరో వైపు సొంత పార్టీ పెడుతారంటూ ఊహాగానాలు వెరసి చర్చ అంత వీరి రాజకీయం పైనే నడుస్తోంది. తాజాగా వీరు కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం […]
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishnarao), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy)లు ఏ పార్టీలో చేరుతారనే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది. ఓ వైపు బీజేపీలో, మరో వైపు కాంగ్రెస్ లో చేరుతారంటూ వ్యాఖ్యలు.. మరో వైపు సొంత పార్టీ పెడుతారంటూ ఊహాగానాలు వెరసి చర్చ అంత వీరి రాజకీయం పైనే నడుస్తోంది. తాజాగా వీరు కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం వేచి చూసి ఏ పార్టీలో నిర్ణయించుకుందామనే యోచనలో ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. అవసరమైతే ప్రత్యేక గ్రూపుగా ఉండైనా ఎన్నికల్లో పోరాడాలనే ఆలోచనలో ఉన్నారనేది వీరిపై వస్తున్న కథనాల సారాంశం. రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీ(BJP) ఓ అడుగు ముందుకేసి 23న అమిత్ షా(Amith Shah) పర్యటన నేపథ్యంలో ఇరువురు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. రెండు పార్టీల క్యాడర్ బలంపై అంచనా వేస్తున్నట్లు ఇరువురు నేతల సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నాయకులు బీఆర్ఎస్‌లో మాజీ ఎమ్మెల్యేలను, టిక్కెట్ ఆశించేవారిని సంప్రదించారు. తద్వారా వారు శక్తివంతమైన సమూహంగా ఎదిగి.. రెండు జాతీయ పార్టీలలో దేనికైనా నిబంధనలను నిర్దేశించాలనేది వీరి వ్యూహంగా తెలుస్తోంది.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కృష్ణారావుకు మళ్లీ పార్టీలో చేరాలని తన మాజీ సహచరుల నుంచి పిలుపులు వస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నెట్‌వర్క్ అంతా తెలుసు. 2012లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ.. పలువురు కాంగ్రెస్(Congress) నేతలు ఆయనకు సన్నిహితులుగానే ఉన్నారు.
మరోవైపు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో సహా బీజేపీ నేతలు కూడా ఆయనకు బీజేపీలోకి స్వాగతం పలికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తమ సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో అరుణ(DK Aruna), జూపల్లి ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. అయితే జిల్లాలో అరుణతో పాటు బీజేపీలో ఉన్న మరో బలమైన నేత జితేందర్ రెడ్డి(Jithender Reddy). వీరికంటూ జిల్లాలో ఓ ఇమేజ్ ఉంది. అదే బీజేపీ కలిసొచ్చింది. ఇప్పుడు జూపల్లి విషయంలోనూ అదే జరుగుతోందనేది బీజేపీ యోచనగా తెలుస్తోంది.
వాస్తవానికి తెలంగాణ ఎన్నికలలో ప్రభావం చూపే అంత కేడర్ బీజేపీకి లేదు. మోదీ(Narendra Modi) ఇమేజ్ లోక్ సభ ఎన్నికల వరకూ పనికొచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్లు వ్యక్తిగత ఇమేజ్‌తో లీడర్లకు పడ్డ ఓట్లు మాత్రమే. ఈటెల రాజేందర్(Etela Rajendar) సొంత ఇమేజ్‌తో హుజురాబాద్(Huzurabad)లో గెలవగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopa Reddy) మునుగోడు(Munugode)లో తన బ్రాండ్‌తో బీఆర్ఎస్(BRS)పై గెలిచినంత పని చేశాడు. ఏ పార్టీలో ఉన్నా తన వాయిస్ బలంగా వినిపించే రఘునందన్ రావు(Raghunandan Rao)ను అసెంబ్లీకి పంపాలనేది రాష్ట్రంలో రాజకీయాలను గమనించే ప్రతీఒక్కరి అభిప్రాయం. సో దుబ్బాక(Dubbaka) ప్రజలు కాస్తా ఆలస్యం చేసారనేది ఒప్పుకోక తప్పదు.
వైసీపీ(YSRCP) టిక్కెట్‌పై ఖమ్మం లోక్‌సభకు ఎన్నికై రాజకీయ అరంగ్రేటం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రాజకీయలకతీతంగా తక్కువ సమయంలోనే జిల్లాలో శక్తివంతమైన నేతగా ఎదిగారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు బీజేపీలో ఉన్న తన మిత్రుల నుంచి ఆహ్వానాలు అందాయి. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రాబల్యం తక్కువ. కేడర్ లేదు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట. తెలుగు దేశంకు కూడా ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. కొత్తగా వైఎస్ఆర్టీపీ వచ్చింది. ఈ క్రమంలో ఆయన బీజేపీ కంటే కాంగ్రెస్‌లో చేరితేనే మంచిదనే భావన ఆయన అనుచరగణం నుంచి వస్తున్న వాదన. ఓ పక్క వైఎస్ఆర్టీపీ(YSRTP) కూడా పొంగులేటి గురించి ప్రస్తావిస్తూ తలుపులు తెరిచే ఉంచామని అంటుంది. టీడీపీ(TDP) సైడ్ వెళ్లే ప్రయత్నం ఎలాగూ పొంగులేటి చేయడం లేదు. కమ్యూనిస్టులతో చేయి కలపరు. ఈ నేపథ్యంలో పొంగులేటి కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ టీమ్(Team Rahul Gandhi) కూడా పొంగులేటితో మంతనాలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఊహాగానాలకు ఎప్పుడు తెరపడుతుందో..!