మాజీమంత్రి, బీఆర్‌ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. జూపల్లి కృష్ణారావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Jupalli Krishna Rao joined the Congress
మాజీమంత్రి, బీఆర్‌ఎస్(BRS) బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) కాంగ్రెస్‌పార్టీ(Congress Party)లో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge).. జూపల్లి కృష్ణారావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరారు. మరోనేత గురునాథ్ రెడ్డి(Gurunath Reddy) కూడా హస్తం గూటికి చేరారు. జూపల్లి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thackrey), పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy), కేసీ వేణుగోపాల్(KC Venugopal), మల్లు రవి(Mallu Ravi), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఉన్నారు.
