వేసవి సెలవులు మే 31తో ముగుస్తుండటంతో తెలంగాణలో జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. తాజా విద్యా సంవత్సరం(2023-24) జూన్ 1న ప్రారంభమవనుంది. దీంతో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు గురువారం నుండి కళాశాలల బాట పట్టనున్నారు.

Junior colleges in Telangana to reopen on June 1
వేసవి సెలవులు(Summer Holidays) మే 31తో ముగుస్తుండటంతో తెలంగాణ(Telangana)లో జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. తాజా విద్యా సంవత్సరం(2023-24) జూన్ 1న ప్రారంభమవనుంది. దీంతో ఇంటర్(Inter) మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు గురువారం నుండి కళాశాలల బాట పట్టనున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం.. మొదటి దశ అడ్మిషన్లు(Admissions) పూర్తి చేయడానికి జూన్ 30 చివరి తేదీ. గడువులోగా రెండవ దశ షెడ్యూల్ కూడా ప్రకటించబడుతుంది. కొత్త అకడమిక్ క్యాలెండర్(Academic Calender) ప్రకారం.. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి 304 రోజులలో జూనియర్ కాలేజీల(Junior Colleges)కు 227 పని దినాలు ఉండనున్నాయి.
ఇదిలావుంటే.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో (Govt Junior Colleges) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పనులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 301.24 కోట్ల రూపాయల ప్రతిపాదనలను పంపింది. 212 ప్రభత్వ జూనియర్ కాలేజీలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లతో పాటు.. ఎనిమిది కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపంది. అలాగే.. 122 ప్రభత్వ జూనియర్ కాలేజీలలో కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి, 48 ప్రభత్వ జూనియర్ కాలేజీలలో ఫర్నిచర్‌తో పాటు కాలేజీలలో రూ.29.99 కోట్ల అంచనా వ్యయంతో బాలబాలికల కోసం 331 మరుగుదొడ్లు(Toilets) నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
