ఓ కిలాడీ లేడీని జూబ్లీహిల్స్‌ పోలీసులు(Jubliee hills Police) అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్(Rape) చేసేందుకు ప్రయత్నించాడని.. డబ్బులు ఇవ్కకుంటే ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తున్న నయీమా సుల్తానా(Naima sulthana)(32) అనే మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఓ కిలాడీ లేడీని జూబ్లీహిల్స్‌ పోలీసులు(Jubliee hills Police) అరెస్ట్ చేశారు. రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్(Rape) చేసేందుకు ప్రయత్నించాడని.. డబ్బులు ఇవ్కకుంటే ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తున్న నయీమా సుల్తానా(Naima sulthana)(32) అనే మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ.. సాయం చేసినవారినే మహిళ బ్లాక్‌ మెయిల్‌(Blackmail) చేస్తోంది . జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ -కేబీఆర్‌ పార్క్ మార్గంలో లిఫ్ట్‌(Lift) కావాలంటూ వాహనదారులను కోరుతూ.. లిఫ్ట్‌ ఇచ్చిన తర్వాత బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసేది. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ పోలీసులకు డ్రైవర్ పరమానంద ఫిర్యాదు చేశాడు. లిఫ్ట్ అడిగి ఇచ్చిన తర్వాత రేప్‌ చేసేందుకు ప్రయత్నించానని తనపై ఆరోపణలు చేసిన సదరు మహిళ.. డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు చెప్తానందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కిలాడీ లేడీ సయీదా నయీమా సుల్తానా జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహిళపై గతంలోనూ పలు పోలీస్‌స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ లేడి వద్ద వందలాది కేసులకు సంబంధించిన ఫైల్స్‌ కూడా ఉన్నాయని తెలిపారు. ఆ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకొని బాధితులకు ఎలాంటి శిక్ష పడుతుందోనని భయపెట్టి డబ్బులు వసూలు చేసేదని పోలీసులు వెల్లడించారు.

Updated On 3 Jan 2024 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story