2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఆఫీస్ బేరర్ల పేర్లను ప్రకటించింది. జాతీయ కార్యవర్గాన్ని జాతీయ‌ అధ్య‌క్షుడు జేపీ నడ్డా ప్రకటించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు చోటు ద‌క్కింది.

2024 లోక్‌సభ ఎన్నికల(Loksabha)కు సన్నాహకాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ(BJP) కేంద్ర ఆఫీస్ బేరర్ల పేర్లను ప్రకటించింది. జాతీయ కార్యవర్గాన్ని జాతీయ‌ అధ్య‌క్షుడు జేపీ నడ్డా(JP Nadda) ప్రకటించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh) జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌(Bandi Sanjay)కు చోటు ద‌క్కింది. అధిష్టానం బండి సంజ‌య్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. బండి సంజ‌య్‌కు అధిష్టానం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ద‌నే ఊహాగానాలు కొంత‌కాలంగా వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సంజ‌య్‌కు జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు క‌ల్పిస్తూ ఊహాగానాల‌కు పుల్‌స్టాప్ పెట్టింది అధిష్టానం.

ఏపీకి చెందిన సత్యకుమార్‌(Sathya Kumar)కు మ‌రోమారు జాతీయ కార్యదర్శిగా అవ‌కాశం క‌ల్పించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ(DK Aruna)ను కూడా కొనసాగించింది. కేర‌ళ‌(Kerala)కు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఏకే అంటోని(AK Antony) కుమారుడు అనీల్ ఆంటోని(Anil Antony)ని కూడా జాతీయ కార్యదర్శిగా నియ‌మించింది బీజేపీ అధిష్టానం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ సరోజ్‌ పాండే(Saroj Pandey)తో పాటు ఎంపీ లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయ్‌(Laxmikantha Bajpai) జాతీయ ఉపాధ్యక్షుడిగా చోటు దక్కించుకున్నారు. ఎంపీలు అరుణ్‌సింగ్‌, రాధామోహన్‌ అగర్వాల్‌(Radhmohan Agarwal)లకు కూడా జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు కల్పించారు. లక్నోకు చెందిన శివ ప్రకాష్‌(Shiva Prakash)ను నేషనల్ కో-ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటు సభ్యుడు సురేంద్ర సింగ్(Surendra Singh) కు జాతీయ కార్యదర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. యూపీకి చెందిన రాజేష్ అగర్వాల్‌(Rajesh Agarwal)ను కోశాధికారిగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Updated On 29 July 2023 12:57 AM GMT
Yagnik

Yagnik

Next Story