Rythu Bandhu Scheme : రైతుబంధు డబ్బులెప్పుడు?
తెలంగాణ(Telangana)లో రైతుబంధు(Rythu Bandhu Scheme) డబ్బులు ఎప్పుడు వస్తాయి? రైతుబంధు డబ్బులు నవంబర్ 28వ తేదీనే రైతుల అకౌంట్‌లో క్రెడిట్ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా ఆ డబ్బులు రాలేదు. మొదట్లో రైతుబంధు డబ్బులు వేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరాలు చెప్పింది. తర్వాత ఓకే అంది.
తెలంగాణ(Telangana)లో రైతుబంధు(Rythu Bandhu Scheme) డబ్బులు ఎప్పుడు వస్తాయి? రైతుబంధు డబ్బులు నవంబర్ 28వ తేదీనే రైతుల అకౌంట్‌లో క్రెడిట్ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా ఆ డబ్బులు రాలేదు. మొదట్లో రైతుబంధు డబ్బులు వేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరాలు చెప్పింది. తర్వాత ఓకే అంది. అయితే హరీశ్‌రావు దీనిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో నవంబర్ 28వ తేదీన రైతుల అకౌంట్‌లో ఆ డబ్బులు పడకకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. దాంతో రైతుబంధు ఆగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ డబ్బులు తమ అకౌంట్‌లో పడతాయని రైతులు ఆశించారు. ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పడినప్పటికీ రైతుబంధు మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆరు గ్యారంటీలు ఇచ్చామని, వాటిల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. అదే సమయంలో రైతుబంధుకు సంబంధించిన డబ్బులను ఎందుకు ఆలస్యం చేస్తున్నదో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు రావడానికి ముందే ఎన్నికల కమిషన్ అధికారులను కలిశారు. రైతుబంధు కోసం కేటాయించిన నిధులను కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసం కేసీఆర్ వాడుకుంటున్నారని,అలా వాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తే రైతుబంధు అకౌంట్లలో డబ్బులు వేయడానికి వీలుపడదని, అలా జరగకుండా చూడండి అంటూ ఈసీ అధికారులకు చెప్పారు. ఇప్పడు ప్రభుత్వం ఏర్పడి మూడు రోజులు గడిచాయి. డబ్బులు వేయడానికి ఏమిటి ఇబ్బంది అని కొందరు అడుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంది. రైతుబంధు 15 వేలు చేస్తామంటూ మ్యానిఫేస్టోలో పెట్టింది కాంగ్రెస్. కౌలు రైతులకు కూడా తాము రైతు బంధు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు షెడ్యూల్ అయిన ప్రకారం రైతుబంధులో డబ్బులు వేయాలి. వేస్తే అవన్నీ రైతుల అకౌంట్‌లో వెళతాయి. అప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? వారికి ఎలా ఇస్తారు? కౌలు రైతులను గుర్తించాలంటే యజమానికి, కౌలు రైతుకు మధ్య జరిగిన ఒప్పందపు డ్యాకుమెంట్ ఉండాలి. ఇది జరగాడానికి ఈజీగా నెలన్నరో రెండు నెలలో పడుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా? లేకపోతే ఈ ఒక్కసారికి భూ యజమానులకే రైతుబంధు ఇస్తుందా? చూడాలి...