అందరినీ ఆకట్టుకునే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయి. ఆయన నిర్ణయాలు ప్రశంసనీయంగా ఉంటున్నాయి. ఆయన ప్రవర్తనకు వందకు వంద మార్కులు పడుతున్నాయి. ఆయనలో ప్రజాస్వామ్యవాది కనిపిస్తున్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అంటున్న మాటేమిటంటే ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకను ప్రభుత్వం అణచివేస్తున్నదని, ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిని అష్టకష్టాలు పెడుతున్నదని! కోదండరామ్‌లాంటి వాళ్లు ఇదే అంటూ వస్తున్నారు.

అందరినీ ఆకట్టుకునే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయి. ఆయన నిర్ణయాలు ప్రశంసనీయంగా ఉంటున్నాయి. ఆయన ప్రవర్తనకు వందకు వంద మార్కులు పడుతున్నాయి. ఆయనలో ప్రజాస్వామ్యవాది కనిపిస్తున్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అంటున్న మాటేమిటంటే ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకను ప్రభుత్వం అణచివేస్తున్నదని, ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిని అష్టకష్టాలు పెడుతున్నదని! కోదండరామ్‌లాంటి వాళ్లు ఇదే అంటూ వస్తున్నారు. ప్రజాసంఘాల నేతలకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసింది ప్రభుత్వం. ఇందిరాపార్క్‌(Indira Park) దగ్గర ఉన్న ధర్నాచౌక్‌ను కూడా ప్రభుత్వం తొలగించింది. తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలకు ఒక వేదిక లేకుండా చేసింది. అలాగే అఖిలపక్షం లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ అంశంపైన అయినా గానీ అఖిలపక్షాన్ని నిర్వహించిన దాఖలాలు లేవు. అఖిలపక్షమనే సత్సంప్రదాయానికి బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం పాతరేసింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కనీసం అభినందనలు కూడా చెప్పలేదు. తమ పార్టీ ఓటమిపై కానీ, కాంగ్రెస్‌ గెలుపుపై కానీ కేసీఆర్ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే కేసీఆర్‌(KCR) చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ వెళ్లి ఆయనను పరామర్శించడం, ఆయన ఆరోగ్యపరిస్థితిపై వాకబు చేయడాన్ని చూస్తుంటే ఒక కొత్త సంప్రదాయాన్ని రేవంత్‌ నెలకొల్పినట్టు అనిపిస్తోంది. పార్టీగా వైరుధ్యాలు ఉన్నా మనుషులుగా కలిసిపోయే వాతావరణం ఉండాలన్నది రేవంత్‌ అభిమతం కావచ్చును. ప్రజాస్వామ్యవాదులు ఆశిస్తున్నది కూడా ఇదే!

Updated On 11 Dec 2023 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story