ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తెలంగాణ(Telangana)లో పర్యటించారు. రెండు భారీ బహిరంగ సభలలో మాట్లాడారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన హామీలను ఇచ్చారు.మొదటిది పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు, రెండోది గిరిజన యూనివర్సిటీ(Tribal University).

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు తెలంగాణ(Telangana)లో పర్యటించారు. రెండు భారీ బహిరంగ సభలలో మాట్లాడారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన హామీలను ఇచ్చారు.మొదటిది పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు, రెండోది గిరిజన యూనివర్సిటీ(Tribal University). ఈ రెండింటిని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానించింది కూడా! వీటితో పాటు తెలంగాణకు మరిన్ని వరాలను కేంద్ర క్యాబినెట్‌ ప్రకటించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంచే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించారు. ఈ మూడు ప్రకటనలతో తెలంగాణ ప్రజలను ఆకర్షించవచ్చని బీజేపీ అనుకుంటోంది. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే అవకాశ బీజేపీకి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు వరాలు ప్రకటించబోతున్నది. ఇందులో భాగంగానే ఆర్టీసీ కార్మికులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తొమ్మిది డీఏలను ఓకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన కేసీఆర్‌(CM KCR) సర్కార్‌ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల మనసు దోచుకున్నదని అనుకోవచ్చు. మహిళలకు సంబంధించి ఓ కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించబోతున్నది.

Updated On 5 Oct 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story