తెలుగు ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా పవరేమిటో రుచి చూపించిన వ్యక్తి టీవీ9 రవిప్రకాశ్(Tv9 Ravi prakash).. ఇప్పుడాయన టీవీ9లో లేకపోయినా అది ఆయనకు బ్రాండ్‌గా మారిపోయింది. టీవీనైన్‌ను రవిప్రకాశ్‌ను వేరువేరుగా చూడలేము. టీవీ 9 రవిప్రకాశ్ నాటిన మొక్క.. దాన్ని మహావృక్షంగా చేసిన ఘనత కూడా ఆయనదే! ఎంతో మంది జర్నలిస్టులకు ఆయన మార్గదర్శకంగా నిలిచారు.
తెలుగు ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా పవరేమిటో రుచి చూపించిన వ్యక్తి టీవీ9 రవిప్రకాశ్(Tv9 Ravi prakash).. ఇప్పుడాయన టీవీ9లో లేకపోయినా అది ఆయనకు బ్రాండ్‌గా మారిపోయింది. టీవీనైన్‌ను రవిప్రకాశ్‌ను వేరువేరుగా చూడలేము. టీవీ 9 రవిప్రకాశ్ నాటిన మొక్క.. దాన్ని మహావృక్షంగా చేసిన ఘనత కూడా ఆయనదే! ఎంతో మంది జర్నలిస్టులకు ఆయన మార్గదర్శకంగా నిలిచారు. టీవీ9 ఆవిర్భావమే సంచలనం. ఆ రోజుల్లో టీవీ9కు ఉన్న క్రేజ్ అలాంటిదిలాంటిది కాదు! అందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది కోరుకునేవారు. టీవీ9 ఉద్యోగులైతే గర్వంగా తమ సంస్థ పేరు చెప్పుకునేవారు. 2019 మే మాసంలో ఆయన టెలివిజన్ స్క్రీన్ మీద చివరిసారిగా కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు మళ్లీ తెరమీదకు వచ్చారు.
టీవీ9 నుంచి ఆయన ఎందుకు నిష్క్రమించాల్సి వచ్చిందో, దాని వెనుక ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే! ఆ విషయాన్నే ఆయన స్థూలంగా చెప్పుకొచ్చారు. తన గొంతు నొక్కేశారని, తనను తెరపైకి రానియకుండా చేశారని అన్నారు. ఇప్పుడున్న మీడియా అంతా ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూ ఉన్నాయని, ప్రతీ రాజకీయ పార్టీకి సొంతగా ఛానెళ్లు ఉన్నాయని చెబుతూ, తాము అలా కాదన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తామన్నారు. నిజాలను నిర్భయంగా చెబతామన్నారు. ఆ తర్వాత తాను ఎంచుకున్న టాపిక్‌ను ప్రజల ముందుకు తెచ్చారు. సరే, ఇన్నేళ్ల తర్వాత ఆయన తిరిగి తెరమీద కనిపిస్తే ఎలా ఉండాలి? అదో సంచలనమవ్వాలి. తెలుగు రాష్ట్రాలలో హాట్‌టాపిక్‌గా మారాలి. కానీ అలా జరగలేదు.
అందుకు కారణం .. ఆయన ఎంచుకున్న అంశం. టీవీ9 ఆరంభంలో రవిప్రకాశ్ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఫ్లోరైడ్ సమస్యను ప్రజల ముందుకు తెచ్చారు. ఇదొక్కటే కాదు, ఫ్యాక్షనిజంతో సీమ ప్రజలు ఎలా కష్టపడుతున్నారో చెప్పారు. అవినీతి అధికారులకు నిద్రపట్టకుండా చేశారు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం నడుం బిగించారు. బోరుబావుల కారణంగా చిన్నారులు చనిపోతున్న తీరును ప్రజెంట్ చేశారు. ఇవన్నీ ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. టీవీ9ను ప్రజలు అక్కున చేర్చుకోవడానికి కారణాలయ్యాయి. అప్పట్లో టీవీ9 ఏ రాజకీయపార్టీని వదల్లేదు.
అయిదేళ్ల తర్వాత రవిప్రకాశ్ తెరమీదకు వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలను ఎత్తి చూపితే బాగుండేది. సమస్యలు లేవా? అంటే బోల్డన్ని ఉన్నాయి. వాటిని వదిలేసి ఏదో స్టడీ పేరుతో సర్వేలను చెప్పడమన్నది రవిప్రకాశ్ స్టాండర్డ్‌కు సూటవ్వలేదు. ఆయన స్థాయికి ఈ కథనం సరితూగేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలే లేవా? అంటే చాలా ఉన్నాయి. ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తుకోవచ్చు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని చర్చించవచ్చు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP), కూటమిల(TDP Alliance) మేనిఫెస్టోల(Manifesto) తీరును ఎండగట్టడవచ్చు. ఇవన్నీ వదిలేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే(Election survey) ఫలితాలు ఆయన నోటి వెంట రావడమే బాగోలేదు. ఇలాంటి సర్వేలు యూట్యూబర్లు చాలా మంది చేస్తున్నారు. మరి రవిప్రకాశ్ గొప్పేమిటి? ఏమైనా కానివ్వండి సుదీర్ఘకాలం తర్వాత తెరమీదకు వచ్చిన రవిప్రకాశ్ తేలిపోయారు.