తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ(TS Congress) ఆరు ప్రధానమైన హామీలతో ప్రజల దగ్గరకు వెళుతోంది. ఈ గ్యారంటీలను ప్రజలకు చేరువ చేస్తే ఈజీగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్‌ అనుకుంటోంది. ఇంటింటికి ఈ హామీలను చేర్చే కార్యాచరణ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో మరో బహిరంగసభను ఏర్పాటు చేయాలనుకుంటోంది.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ(TS Congress) ఆరు ప్రధానమైన హామీలతో ప్రజల దగ్గరకు వెళుతోంది. ఈ గ్యారంటీలను ప్రజలకు చేరువ చేస్తే ఈజీగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్‌ అనుకుంటోంది. ఇంటింటికి ఈ హామీలను చేర్చే కార్యాచరణ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో మరో బహిరంగసభను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఆ బహిరంగసభ ద్వారా ఆరు ప్రధాన హామీలను ప్రజలకు ఆయనతో చెప్పించాలనుకుంటోంది. టికెట్ల ప్రకటన తర్వాత ఈ ప్రధాన హామీలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తోంది. బీఆర్‌ఎస్‌కు గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టుంది. అందుకు కారణం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే. రైతు బంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ ఇలాంటి పథకాలు బీఆర్‌ఎస్‌కు ఓట్లను తెచ్చిపెడుతున్నాయి. కల్యాణలక్ష్మి పథకాన్ని కౌంటర్‌ చేయడానికి కాంగ్రెస్‌ అంతకంటే మంచి స్కీమ్‌తో రాబోతున్నది. కల్యాణలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ లక్ష రూపాయలకు తోడుగా తులం బంగారాన్ని ఇవ్వాలని అనుకుంటోంది..

Updated On 7 Oct 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story