పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) సమీపిస్తున్న కొద్దీ ఆశావహులు పెరుగుతున్నారు. తాజాగా మెదక్‌లో(Medak) పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్(BRS) నేతలు ఎవరికివారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాజాగా మెదక్ బరిలో తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కోరుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) సమీపిస్తున్న కొద్దీ ఆశావహులు పెరుగుతున్నారు. తాజాగా మెదక్‌లో(Medak) పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్(BRS) నేతలు ఎవరికివారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాజాగా మెదక్ బరిలో తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు ఉద్యమంలో పాల్గొన్నానని, కేసీఆర్(KCR) వెంటే నడిచానని ఆయన అంటున్నారు. ఎంపీగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావుకు వినతి పత్రాలు కూడా సమర్పించారు.
ఆర్.సత్యనారాయణ(R Sathyanarayana) జర్నలిస్టుగా(Journalist) సంగారెడ్డిలో పనిచేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత అప్పటి టీఆర్‌ఎస్(TRS), ఇప్పటి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఉద్యమ సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని కేసీఆర్ ఆదేశించడంతో తన పదవికి ఇంకా 4 ఏళ్ల 3 నెలల సమయం ఉన్నా రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు పబ్లిక్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిచెందడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా రాజీనామా చేశారు. కేసీఆర్ ఆదేశాలతో నిజాయితీగా పనిచేశానని ఎంపీ స్థానం కేటాయించాలని కోరుతున్నారు.
అయితే మెదక్ బరిలో నిలిచేందుకు బీఆర్‌ఎస్‌లో లిస్ట్ పెద్దదిగానే ఉంది. మెదక్ ఎంపీ స్థానం(MP Seat) పరిధిలో మెదక్, సిద్దిపేట, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలున్నాయి. మెదక్ మినహా మిగతా చోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో మెదక్ బరి నుంచి నిలబడితే విజయం సులువవుతుందని భావించడంతో ఈ స్థానానికి పోటీ పెరిగింది. మెదక్ ఎంపీగా పోటీచేసేందుకు మదన్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచిచూడాల్సిందే.