గయానా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌లో పాల్గొన్న జట్టులోంచి టీమిండియా ఒక మార్పు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు.

Ind vs Wi Second T20
గయానా వేదికగా భారత్(India), వెస్టిండీస్(Westindies) మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌లో పాల్గొన్న జట్టులోంచి టీమిండియా ఒక మార్పు చేసింది. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) స్థానంలో రవి బిష్ణోయ్(Ravi Bishnoi) జట్టులోకి వచ్చాడు.
భారత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన వెస్టిండీస్‌కు చాలా పేలవమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో జాసన్ చార్లెస్ కూడా ఔటయ్యాడు. 32 పరుగుల వద్ద మూడో వికెట్ కూడా కోల్పోయింది. అప్పటినుంచి నికోలస్ పూరన్(Nicholas Pooran), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(Powell) జాగ్రత్తగా ఆడారు. స్కోరు 85 పరుగుల వద్దకు రాగానే నాలుగో వికెట్ పడింది. పావెల్ 21 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా(Hardik Pandya) బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో నికోలస్ పూరన్ బ్యాట్ నుంచి పరుగులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పూరన్ అర్ధసెంచరీ(67) కూడా పూర్తి చేసుకున్నాడు.
అయితే 16వ ఓవర్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ తడబడింది. చాహల్(Chahal) వేసిన ఆ ఓవర్లో మూడు వికెట్లు పడ్డాయి. ఒకరు రనౌట్ కాగా.. ఒకరు స్టంపౌట్ అయ్యారు. క్రీజులో పాతుకుపోయిన షిమ్రాన్ హెట్మెయర్ కూడా 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ అయ్యాడు. దీంతో భారత్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే చివర్లో అకీల్ హుస్సేన్ (16), అల్జారీ జోసెఫ్ (10)లు 26 పరుగులు చేసి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విండీస్‌కు విజయాన్ని అందించారు. దీంతో విండీస్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో హార్దిక్ మూడు, చాహల్ రెండు, ముఖేష్(Mukesh), అర్షదీప్(Arshadeep) తలా ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు మరోసారి పేలవమైన ఆరంభం లభించింది. 7 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్(Shubhman Gill) పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ ఒక్క పరుగు చేసి రనౌట్ అయ్యాడు. వేగంగా పరుగులు చేస్తున్న క్రమంలో ఇషాన్ కిషన్ కూడా 27 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత హార్దిక్, తిలక్ వర్మ(Thilak Varma)లు క్రీజులో నిలదొక్కుకుని స్కోరు 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ(51) తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ 51 పరుగుల వద్ద అవుటయ్యాడు. 24 పరుగుల స్కోరు వద్ద హార్దిక్ అల్జారీ జోసెఫ్‌కు చిక్కాడు. దీంతో 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అఖిల్ హుస్సెన్, జోసఫ్, షెపర్డ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. కీలక ఇన్నింగ్సు ఆడిన నికోలస్ పూరన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
