తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా బాల‌కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడ‌నున్నారు. శుక్ర‌వారం ఆయ‌న త‌న అనుచ‌ర‌గ‌ణంతో బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు. మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్ స‌మ‌క్షంలో బాల‌కృష్ణారెడ్డి గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు జిట్టా బాల‌కృష్ణా రెడ్డి(Jitta Balakrishna Reddy) కాంగ్రెస్ పార్టీ(Congress)ని వీడ‌నున్నారు. శుక్ర‌వారం ఆయ‌న త‌న అనుచ‌ర‌గ‌ణంతో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో చేర‌నున్నారు. మంత్రులు హ‌రీశ్‌రావు(Harish Rao), కేటీఆర్(KTR) స‌మ‌క్షంలో బాల‌కృష్ణారెడ్డి గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు. హైద‌రాబాద్‌(Hyderabad)లోని తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జిట్టా బాల‌కృష్ణా రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేర‌నున్నారు. హైద‌రాబాద్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్‌తో జిట్టా బాల‌కృష్ణా రెడ్డి గురువారం భేటీ అయ్యారు. భేటీలో భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

ఇదిలావుంటే.. జిట్టా బాల‌కృష్ణా రెడ్డి త‌న యువ తెలంగాణ పార్టీ(Yuva Telangana Party)ని బీజేపీ(BJP)లో విలీనం చేశారు. అక్క‌డ అధిష్టానంపై తిరుగుబాటు చేయ‌డంతో పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. అనంత‌రం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి(Komatireddy Venkatreddy) నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే భువ‌న‌గిరి(Bhuvanagiri) నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల నేపథ్యంలో ఆయ‌న‌ కాంగ్రెస్‌ను వీడి కారెక్క‌నున్నారు.

Updated On 19 Oct 2023 8:56 PM GMT
Yagnik

Yagnik

Next Story