కాంగ్రెస్ పార్టీపై(Congress party) జీవన్‌రెడ్డి(Jeevan Reddy) చాలా అసహనంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీపై(Congress party) జీవన్‌రెడ్డి(Jeevan Reddy) చాలా అసహనంగా ఉన్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ను వీడే అవకాశాలున్నాయి. తన ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డిని(Maru Gangareddy) హత్య(Murder) చేయడంతో ఆయన ఆవేదనతో రగిలిపోయారు. అధికారపార్టీలో ఉండి అధికారపార్టీ నేతలను హత్య చేయడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను సేవ చేయాలనుకుంటే ఓ ట్రస్ట్ పెట్టుకుని సేవలందిస్తా కానీ.. మీ పార్టీకో దండం అని వ్యాఖ్యానించారు. గత మూడు నెలల నుంచి తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నానని పార్టీ కోసం భరించానని జీవన్‌రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా జీవన్‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఐ యాం వెరీ సారీ అంటూ ఫోన్ కట్ చేశారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. కట్టర్ కాంగ్రెస్ వాది. గత కొంత కాలంగా ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తి నెలకొంది. తనకు ఒక్క మాటైనా చెప్పకుండా ఇతర పార్టీ ఎమ్మెల్యేను ఎలా చేర్చుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లేదని ఆవేదన చెందగా అప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు సముదాయించారు. ఢిల్లీ పిలిపించి జీవన్‌రెడ్డిని బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అన్యాయం జరిగిందన్న భావనలో జీవన్‌రెడ్డి ఉన్నారు. అయితే తాజాగా తన అనుచరుడిని హత్య చేయడంతో ఆయన మరింత ఆవేదనకు లోనయ్యారు. ఇక పార్టీలో ఉండి లాభం లేదనుకుని ఒకటి, రెండు రోజుల్లో తన అనుచరులతో సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారని తెలిసింది. పార్టీకి దూరంగా ఉండడమో లేక మొత్తానికి పార్టీకి గుడ్ చెప్పనున్నారా అనేది తేలనుంది.