మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని

మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని, అవి నోటీసులా కాకుండా లేఖలా ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చిన నోటీసును తాను పరిశీలించానని, దానిలో కేటీఆర్ ను ఏ సెక్షన్ కింద పిలుస్తున్నారో పేర్కొనలేదు. అది లేఖలా ఉంది. ఏదైనా విచారణ ఏజెన్సీ నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని, కానీ కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో అవి లేవన్నారు. కేటీఆర్ కు ఏసీబీ ఇచ్చిన లేఖ సారాంశాన్ని పరిశీలిస్తే.. ప్రశ్నించేందుకు, పత్రాలు సమర్పించేందుకు ఏసీబీ ముందు విచారణకు హాజరుకావాలని ఉన్నదని. కేటీఆర్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఆయనకు 94 బీఎన్ఎస్ఎస్ (91 సీఆర్పీసీ) కింద నోటీసు ఇవ్వాలి కానీ ఇక్కడ అవి లేవు కేటీఆర్‌ కు ఏసీబీ 160 సీఆర్పీసీ (ప్రస్తుతం 179 బీఎన్ఎస్) కింద నోటీసు ఇచ్చారని, అయితే ఒక కేసు విషయంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను పిలిపించాలంటే 179 బీఎన్ఎస్ కింద నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ కేటీఆర్ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు మాత్రమే అని, ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న నిందితుడికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వరాదని జేడీ అన్నారు.

ehatv

ehatv

Next Story