నమ్మండయ్యా.. నిజమైన పెట్టుబడుల
ఈనెల 3 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) బృందం అమెరికాలో(America) పర్యటిస్తోంది. మంత్రి శ్రీధర్‌బాబు(Minister sreedhar babu), సీఎస్ సహా దాదాపు 30 మంది ప్రతినిధుల బృందం పెట్టుబడులే(Investments) లక్ష్యంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కంపెనీలతో(cmpanies) ఒప్పందాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయల్(Bio fuel Plant) ప్లాంటును ఏర్పాటు చేసేందుకు న్యూయార్క్‌లో(New york) రేవంత్ బృందం ‘స్వచ్ఛ్ బయో’(Swach bio) అనే కంపెనీతో సోమవారం ఒప్పందం చేసుకొన్నది. అయితే రేవంత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ‘స్వచ్ఛ్ బయో’తో కాదు.. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’తో అని తేలింది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు రేవంత్ తమ్ముడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి. వాటాదారు రేవంత్‌కు సన్నిహితుడు హర్ష పసునూరి. అయితే వీటిపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం స్వచ్ఛ్ బయోగ్రీన్ అనే సంస్థ ఏర్పాటైంది. ఈ కంపెనీ తెలంగాణలో వెయ్యి కోట్లు ఎలా పెట్టుబడులు పెడతాయని అనుమానం వ్యక్తంచేశారు.
బీఆర్‌ఎస్ సోషల్(BRS) మీడియా ఇంచార్జి క్రిషాంక్ ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తన తమ్ముడి షెల్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చొకొని తెలంగాణకు ఫ్రాడ్ పెట్టుబడులు తెస్తున్నారని విమర్శించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ కంపెనీ వివరాలు, అందులో ఉన్న డైరెక్టర్లు, అది ఎప్పుడు ఏర్పాటైందన్న పత్రాలను వైరల్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి దిద్దుబాటుకు చర్యలకు ప్రయత్నిస్తున్నారట. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో(Jayesh ranjan) ఓ వీడియోను కూడా విడుదల చేశారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు నిజమేనని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయితే గతంలో కూడా రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు వచ్చినప్పుడు ఈ 10 ఏళ్లలో జయేష్ రంజన్ ఎన్నడూ మీడియా ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఈ పెట్టుబడులపై ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందో చెప్పాలని, సీఎం రేవంత్‌కు పెట్టుబడులపై వివరణ ఇచ్చే దమ్ములేకనే జయేష్ రంజన్‌తో వివరణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని, సీఎం రేవంత్ పెట్టుబడులపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.