☰
✕
జనగామకు(Janagam) చెందిన శృతికి భువనగిరికి చెందిన మిట్ట వేణుతో వివాహం జరిగింది.
x
జనగామకు(Janagam) చెందిన శృతికి భువనగిరికి చెందిన మిట్ట వేణుతో వివాహం జరిగింది. ఆమెకు నాలుగవ నెల నుంచి జనగామ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(MCH)లోనే పరీక్షలు చేయిస్తున్నారు. చివరి నెల పరీక్ష కోసం శృతిని ఆమె తల్లి మళ్లీ ఎంసీహెచ్ కు తీసుకు వెళ్లగా ప్రసూతి వైద్యులు ఆగ్రహించారు. యాదాద్రి జిల్లాకు చెందిన గర్భిణివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. వేరే జిల్లా కు చెందిన వారికి ఇక్కడ కాన్పు(Delivery) చేయం. మీ జిల్లాలో పెద్దాస్పత్రి ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితురాలు ఆరోపించింది. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, స్థానికంగా ప్రసూతి డాక్టర్ల కొరత ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలన్నామే తప్ప సొంత జిల్లా కాదని నిరాకరించలేదని శృతిని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్లకు ఆదేశించామని తెలిపారు.
Eha Tv
Next Story