Telangana Elections 2023 : ఇది విన్నారా? అప్పట్లో పవన్ కల్యాణ్ తెలంగాణకు మద్దతు ఇచ్చాడట!
జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Janasena Pawan Kalyan) ఆనాడు తెలంగాణ(Telangana)కు మద్దతు ఇచ్చారట! ఆయనగారికి ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందట! నిఝంగా..నిజమండి.. ఇవి ఆయన నోటి వెంటే వచ్చిన పలుకులు! తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మానేసి తెగ బాధపడ్డానని పవన్ కల్యాణ్ గతంలో చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Janasena Pawan Kalyan) ఆనాడు తెలంగాణ(Telangana)కు మద్దతు ఇచ్చారట! ఆయనగారికి ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందట! నిఝంగా..నిజమండి.. ఇవి ఆయన నోటి వెంటే వచ్చిన పలుకులు! తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మానేసి తెగ బాధపడ్డానని పవన్ కల్యాణ్ గతంలో చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. తెలంగాణవారు మర్చిపోతే కదా గుర్తుకు తెచ్చుకోవడానికి.. ఆనాడు తెలంగాణపై ఎంత ఎకసెక్కాలాడారో ఎవరూ మర్చిపోలేదు. ఒక్కటంటే ఒక్కటి తెలంగాణ కోసం మాట్లాడిన మాటలుంటే చూపించు పవన్.. ఒక్క పేపర్ క్లిప్పు చూపించినా తెలంగాణవారు సంతోషపడతారు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు తిండితిప్పలు లేకుండా కుమిలిపోయిన మీకు ఇప్పుడు తెలంగాణ మీద అవాజ్యమైన ప్రేమ ఎందుకు తన్నుకుని వస్తుంది? ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుండేసరికి తెలంగాణపై ఎక్కడ్లేని పామరం పుట్టుకొచ్చేసింది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, పోరాటవీరులు, సామాజికస్పృహ ఉన్నవారు, అమాయకులు అని అందరూ అంటుంటారు కదా! కానీ పవన్ దృష్టిలో మాత్రం గొర్రెలు, ఏది చెప్పినా ఇట్టే నమ్మేస్తారు! అంతే కదండి పవన్ కల్యాణ్‌గారు..! హన్మకొండ(Hanmakonda)లో నిర్వహించిన విజయసంకల్ప సభలో తెలంగాణ గురించి ఇంకా చాలా చాలా చెప్పుకొచ్చారు. ఆయనకు తెలంగాణ ఎంతో బలాన్ని ఇచ్చిందట! ఆ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో రౌడీలతో పోరాడుతున్నారట! ఆయనగారి పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందట! ఆంధ్రప్రదేశ్‌లో ఎలా తిరుగుతున్నారో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతారట! ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తారట! తెలంగాణ యువత ఎందుకు చనిపోయారో తెలుసా పవన్? (తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి పరోక్షకారకులలో మీరు కూడా ఉన్నారు కదండి). తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానని చెప్పిన పవన్ బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం ఆయనకు బాధ కలిగించిదట! మరింత కాలం ఈ విషయం మీకు ఎందుకు గుర్తుకురాలేదు?
తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని, బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని భారతీయ జనతా పార్టీతో కలిశానని అన్నారు పవన్.. బాగానే ఉంది.. రేపొద్దున ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమి విజయం సాధిస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? పోనీ కనీసం బీసీకైనా ఆ పదవి అప్పగిస్తారా? ఇది మాత్రం పవన్‌ను అడగకూడదు. అడిగినా ఆయన దగ్గర జవాబు ఉండదు..