రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు సోమవారం తెలిపారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Elections)ల్లో సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన(Janasena) పార్టీ మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు సోమవారం తెలిపారు. హైద‌రాబాద్‌(Hyderabad)లో పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వారు సూచించారు. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, వైరా, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (TDP)తో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు.

Updated On 2 Oct 2023 8:10 PM GMT
Yagnik

Yagnik

Next Story